వలపుల గాయం
వలపుల గాయం


వలపుల గాయం ఆ తలపులతో వ్రణమేలే
వెలుపల మాయం అయినాలోన రణమేలే
ప్రేమ చిచ్చులో అణుబాంబులూ చిన్నవేలే
రోమ రోమానా చెప్పనే ఆ కథలే భిన్నమేలే
వలపుల గాయం ఆ తలపులతో వ్రణమేలే
వెలుపల మాయం అయినాలోన రణమేలే
ఎందుకొచ్చినా ఎలమి ఎదలో ఏరుల పారే శోకం
ముందుకొచ్చినా ముసిమి తెలపను లేదే సుఖం
కలిసొచ్చే కాలం కలసి రావాలిలే ఎదలే కలపను
కలలోచొచ్చి కమనీయమై కనిపించదు తెలపను
వలపుల గాయం ఆ తలపులతో వ్రణమేలే
వెలుపల మాయం అయినాలోన రణమేలే
తారకలే దిగివచ్చినా తన్మయమూ కలగదే
మేనకలా మెరిసినా ఆ మెరిపేమి మిగలదే
మెలకువలో మెదడంతా నిండి ఉండేనులే
అణకువుగా అందుకోనూ నిల్చుడుందులే
కోరికేమో కొరివిలా ఓ కునుకే ఏనీయదుగ
ఊరికేనూ ఉండకా అటీటూ పోనీయదుగ
వలపుల గాయం ఆ తలపులతో వ్రణమేలే
వెలుపల మాయం అయినాలోన రణమేలే
ప్రేమ చిచ్చులో అణుబాంబులూ చిన్నవేలే
రోమ రోమానా చెప్పనే ఆ కథలే భిన్నమేలే
ఊహించనూ ఊసులా తోచదు మనసులో
సాహసించనూ సరసంలేదే ప్రేమ మసకలో
గుండె గుబులు గూడుకట్టే జాడ కోసమూ
ఉండలేని వంటరిచెప్పే తోడు అవసరమూ
వలపుల గాయం ఆ తలపులతో వ్రణమేలే
వెలుపల మాయం అయినాలోన రణమేలే