గురి
గురి
ప౹౹
గురి చేరాలంటే నలుగురి తోడ్పాటూ కావాలి
చెరిసగం ఒకటవ్వాలన్న కోరికే కదలి రావాలి ౹2౹
చ౹౹
కాలమంతా కలలతోనే గడిచిపోయే ఓరన్నా
కలిసుండే అవకాశమూ కలిగేనా ఈసారన్నా ౹2౹
గజిబిజి ఆలోచనలేలా ఉన్నా గందరగోళంతో
జిగిజిగి ఎద జిందగీ కలిసెలే వలపు మేళంతో౹ప౹
చ౹౹
చెమరించిన కన్నులలో చెలిమిని చూడలేవా
పొటమరించిన పైయ్యెదలో ప్రేమనే కానలేవా ౹2౹
వయసుతోపాటు వలదన్న వచ్చేసెలే వరవడి
సొగసుతో శోభాయమానమై తీర్చు త్వరపడి ౹ప౹
చ౹౹
నడచి వచ్చిన నమ్మకాన్ని నీదరికే చేర్చుకోవా
గడచి పోయిన కాలాన్ని గణించక మర్చిపోవా ౹2౹
ఒకరికి ఒకరంటూ ఒదిగిపోవా ఎదలోనికంతా
వేరొకరు వేలెత్తని ఎలమి చూపు లోకానికంతా ౹ప౹