ఈరోజే తెలిసింది
ఈరోజే తెలిసింది
ప౹౹
ఈరోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం
ఈరోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం
తనువులోని తమకమే తకధినలై తరలివచ్చి
ఈరోజే తెలిసింది మనసులోనికి మరలివచ్చి
ఈరోజే తెలిసింది ఈరోజే తెలిసింది....
చ౹౹
వచ్చాకా వచ్చాక మనసులో మరుల తలపు
నచ్చాకా నచ్చాక వయసులో వలపు మలపు
చెలిమిలోని సౌఖ్యం చెరిసగం పంచుకొన్నాకా
గెలిచిపోయే మార్గము తెలిసి ఎంచుకొన్నాకా
ఈ రోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం
ఈ రోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం
చ౹౹
స్వాగతం పలికి స్వప్నానికి మదిలో నిలపాలి
ఏ గతం చూపని గతులనే పలికించి చూపాలి
మరచిపోని జ్ఞాపకాలతో మానసమే నిండాలి
తరచి చూసే తన్మయాలతో తనువూ పండాలి
ఊసులన్నీ కలబోసి ఉరకలేసి ఊరించాకనూ
ఈ రోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం
ఈరోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం
చ౹౹
ఆకురాలే ఋతువులో ఆ ఆమనే అలిగినట్లు
కాకు స్వరాలే క్రమంతప్పి కనుమరుగయినట్లు
అన్ని ఆశలూ ఆవిరి కానీకులే అదుపు తప్పేసి
కొన్ని స్నేహాలూ కొండెక్కులే కోరికలనూ కప్పేసి
ఈరోజే తెలిసింది వివరం ఆ ఎదలోని స్వరం
ఈరోజే తెలిపింది ఈడు చెప్పిన ఆ అవసరం
తనువులోని తమకమే తకధినలై తరలివచ్చి
ఈరోజే తెలిసింది మనసులోనికి మరలివచ్చి
ఈరోజే తెలిసింది ఈరోజే తెలిసింది....