తరుణం
తరుణం


తరలివచ్చే ఆ తరుణం తానె తెచ్చే కానుకలు
కలసివచ్చే ఎద ప్రేరణం తిరిగి పెంచే కోరికలు ౹2౹
చ౹౹
చంద్రబింబం సూర్యడంబం సూటిగా చూడనే
మంద్ర బింకం ఆ ప్రేమపొంకం వాటుగా వేడినే
తొలి వలపు జ్ఞాపకాలే తోరణాలుగా తొడిగినే
మలి కాలపు ప్రాపకాలై అరణాలనూ అడిగినే ౹ప౹
చ౹౹
పూలగంధం ప్రేమబంధం పెనవేసి కోరమనినే
చాల అందం ఆ లేమ డెందం కోరి చేరమనినే
పూసిన పూలై పులకించినే ఎద చేరిన వెన్నెలే
రాసిన అక్షరాలై రంజిల్లెనే వన్నెలా సంతకాలే ౹ప౹
చ౹౹
గుండెల్లో ఏముందో గుర్తెరిగి మరి చెప్పేయనా
కన్నుల్లో దాగున్న కాంక్షనే కనిపెట్టి విప్పేయనా
ఆరు ఋతువులు ఆమనితో హాయి పంచగా
పోరు క్రతువులు పొంగించనే ప్రేమనే ఎంచగా ౹ప౹
చ౹౹
తరలి వచ్చిన వసంతం తనే చేసికొనే సొంతం
పొరలి పొంగిన పొంకం పాదక్రాంతమే సాంతం
తరలివచ్చే ఆ తరుణం తానె తెచ్చే కానుకలు
కలసివచ్చే ఎద ప్రేరణం తిరిగి పెంచే కోరికలు ౹ప౹