మరపురానిదే...
మరపురానిదే...


ప౹౹
మరపురానిదే మరులుతో కూడిన జ్ఞాపకం
ఎరపులేనిదే ఎపుడూ లేత వలపు ప్రాపకం
మరపురానిదే మరులుతో కూడిన జ్ఞాపకం
ఎరపులేనిదే ఎపుడూ లేత వలపు ప్రాపకం
చ౹౹
ఎదలో చేరి వెక్కిరించిన వైనమే ఆ గాయం
కథలో మాదిరి కల్పనతో అవలేదే మాయం
కళ్ళతో గుచ్చిగుచ్చి గుండెనే చేసి గుల్లగానే
తాళ్ళతో కట్టినా తన్మయం ఆగదు గిల్లగానే
మరపురానిదే మరులుతో కూడిన జ్ఞాపకం
ఎరపులేనిదే ఎపుడూ లేత వలపు ప్రాపకం
చ౹౹
అడిగితే వచ్చేది కాదులే వలపూ వసంతం
అడకగ ఇచ్చే హృదయమే కావాలి సొంతం
పగలు ర
ేయీ పల్లవించేదిలే ప్రేమ అంకురం
పగులులేని బంధమై ప్రభవించే ఓసంకులం
మరపురానిదే మరులుతో కూడిన జ్ఞాపకం
ఎరపులేనిదే ఎపుడూ లేత వలపు ప్రాపకం
చ౹౹
కాసేపు సేదతీరనీయవా ఆ కవ్వించే కలలతో
ఎంతసేపు ఎదురేగి ఊరేగేవు ఎదఊయలతో
చూసాకా కళ్ళల్లోని కమనీయమూ కనులార
వేచాకా పోకళ్శల్లోని పొంకమవునే తేనెలూర
గుండెగాయం మండిపోనీక అలా ఉండిపోవా
దండకారణ్యమే పూలదండలతో నిండిపోవా
మరపురానిదే మరులుతో కూడిన జ్ఞాపకం
ఎరపులేనిదే ఎపుడూ లేత వలపు ప్రాపకం
మరపురానిదే...మరపురానిదే.....