నేనింతే నేస్తం
నేనింతే నేస్తం
ప౹౹
నేనింతే నేస్తం అడగక ఇచ్చేస్తాను హృదయాన్ని
నేనింతే నేస్తం ఆగక ఆస్వాదిస్తా మహోదయాన్ని
నేనింతే నేస్తం.... ౹2౹
చ౹౹
ఉషస్సులోని ఆ తేజస్సుని తెచ్చేస్తాలే నీకోసం
సొగసులోని సోయుగాన్ని అర్పిస్తాలే సర్వసం
పుట్టతేనె పట్టినేను రుచి చూపిస్తా తీయదనం
పట్టుకొని చేయి చేయి చవిచూపిస్తా కొత్తదనం
ఊసులన్నీ విన్నాక ఊరకనే చూసేసి వెళ్ళమాకు
ఆశలన్నీ పెంచేసి ఆ దరికేమో చేరేసి మళ్ళిపోకు
ఊసులన్నీ విన్నాక ఊరకనే చూసేసి వెళ్ళమాకు
ఆశలన్నీ పెంచేసి ఆ దరికేమో చేరేసి మళ్ళిపోకు
నేనింతే నేస్తం అడగక ఇచ్చేస్తాను హృదయాన్ని
నేనింతే నేస్తం ఆగక ఆస్వాదిస్తా మహోదయాన్ని
నేనింతే నేస్తం....
చ౹౹
కనిపించనీ ఆ కమనీయమూ రెండు కళ్ళలో
సవరించనీ సరిలేని ప్రేమని వలపు వాకిళ్ళలో
మనసు మాయే మరిపించి మైమరిపించనూ
ధనసులా గురిపెట్టి తలపువర్షం కురిపించనూ
చిరకాలం కొనసాగని ప్రేమని చిగురించీ మదిలో
కలకాలం కలుసుండాలని కోరుకో ప్రతి యాదిలో
చిరకాలం కొనసాగని ప్రేమని చిగురించీ మదిలో
కలకాలం కలుసుండాలని కోరుకో ప్రతి యాదిలో
నేనింతే నేస్తం అడగక ఇచ్చేస్తాను హృదయాన్ని
నేనింతే నేస్తం ఆగక ఆస్వాదిస్తా మహోదయాన్ని
నేనింతే నేస్తం....
నేనింతే నేస్తం....