తాళమేయనీ సమ్మోహన రాగానికి
తాళమేయనీ సమ్మోహన రాగానికి


చతుర్ముఖుడు చందనపు మీగడతో చిత్రాంగికి పోతపోసెనా
కృష్ణపక్షపు తుదిరేయి తన కేశసంపదలో కునుకేసెనా
కలువరేకులు కోమలి కనులుగా రూపుదాల్చి కొలువుతీరెనా
నిండైన జోడుకడవలు అక్కున చిక్కి తిష్ఠవేసెనా
లేతసోయగపు సిరులకు ఉత్తరదిక్పాలకుని నవనిధులు సరితూగునా
తనువుకు హత్తుకుపోయిన ఆభరణముల భాగ్యముజూచి అసూయపుట్టక మానునా
లలన లావణ్యమునకు మంత్రముగ్ధమైన దర్పణం రెప్పవేయమరచెనా
-ప్రశాంత్