ఒక ఉత్తరం
ఒక ఉత్తరం
ప౹౹
ఉత్తరమే రాస్తున్నా ప్రత్యుత్తరమే కోరుకొని
సత్వరమే సలహా ఈయవా నను చేరుకొని ౹2౹
చ౹౹
ఉభయకుశలోపరి అని నేనూ ఊరించనూ
అభయంమిచ్చేసి అలా మరి అలరించనూ ౹2౹
గుండెలోని గుసగుసలే గురిగా చెప్పేందుకే
ఉండబట్టలేని ఊసులన్ని ఒప్పజెప్పేందుకే ౹ప౹
చ౹౹
మరచిపోని గురుతులు మరల గుర్తించను
చరచి వీపునూ శహబాషని మురిపించను ౹2౹
భాషా పటిమను పటికబెల్లమల్లే ప్రకటించ
ఆషామాషీగా రాయలేనులే అది వికటించ ౹ప౹
చ౹౹
జీవిత అనుభవాలే అనుభవించి రాయనా
కవిత కుసుమాలే కల్పనతో పూయించనా ౹2౹
ఈనాటి కలను విపులంగా విశదీకరించను
ఏనాటికైనా కూలంకషంగాను వివరించను ౹ప౹