Ramesh Babu Kommineni

Romance

5.0  

Ramesh Babu Kommineni

Romance

ప్రేమ

ప్రేమ

1 min
619



ప౹౹


రెక్కలు విప్పి రెపరెపలాడేదేగా ఈ ప్రేమా

లెక్కలు అడగని చిక్కులే లేనిదే ఆ ప్రేమా ౹2౹


చ౹౹


తానూగు తరుణాన తన్మయమే కదలాడి 

నూనూగుమీసాల నూన్యతతో మొదలిడి ౹2౹

తీరికేలేని తీరాలెన్నో చేరాలని తీర్మానించీ

ఉరికే జలపాతమై ఊరించేనే ఆహ్వనించీ ౹ప౹


చ౹౹


జగమంతా రామమయం వెదికి చూసినా 

జనమంతా ప్రేమమయం ఎందు చూసినా ౹2౹

ప్రేమలో పెన్నిదని ప్రేమించాక తెలియును

జన్మలో జవనిక తొలిగాకే అది కలియును ౹ప౹


చ౹౹


పూలదర్పం పూతరేకుల తియ్యదనమేగా

కాలగర్భం ముంచ లేనిది వలపుదనమేగా ౹2౹

తనువుల తపనల తాండవమేలే ఈ ప్రేమ 

అణువుల అంతరంగపు ఆచరణే ఆ ప్రేమ ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance