మనమిద్దరం
మనమిద్దరం


తనకు మించిన ఆకర్షణేదో ఇద్దరిమధ్య చిగురించెనని కన్నుకుట్టెనే నేలకి
మనకు చెందిన అదృష్టమేదో తనకందలేదని అక్కసు పొంగె తొంగిచూసే నింగికి
మన బిగికౌగిలిలో ఉక్కిరిబిక్కిరాయె ఊపిరాడక గాలికి
తాను తీర్చలేని దాహముందని గర్వభంగమాయే ఉప్పొంగిపోయే నీటికి
చలి రగిలించే ఇరువురి వెచ్చని శ్వాసల సరాగాలకు చెమటలు పట్టే నిప్పుకి
పంచభూతాలకే ప్రణయపాకం పెంచే యాగమేదో చేసే యోగం దొరికిన కారణజన్ములమే మనమిద్దరం
-ప్రశాంత్