నా'లో నేనింతే'నా
నా'లో నేనింతే'నా


స్వప్రయోజనాలకై సాటిమనిషిని సమిధని చేసే స్వార్ధముంది
తనకు మించిన ధర్మం శిరోభారమనే సంకుచితత్వముంది
అందరికి అందకుండా దూరముంచే అహమను అడ్డుగోడుంది
ఆధిక్యత అందలాన్ని అడ్డదారులలో అందుకోవాలనే అల్పబుద్దుంది
ఆపదలో ఆసరా అందించలేని అంతరంగ అంగవైకల్యముంది
భవబంధాలనే దృఢకవచాన్ని బంధనాలుగా భ్రమించే భావదారిద్య్రముంది
జగదైకకుటుంబాన్ని వైషమ్యాలతో వేరుచేసే విషపువేరు నైజముంది
-కె ప్రశాంత్