STORYMIRROR

PRASHANT COOL

Comedy Classics

5  

PRASHANT COOL

Comedy Classics

వన్నెలాడి వశీకరణం

వన్నెలాడి వశీకరణం

1 min
312

బుల్లితెర బంధించే మాయచెర

చల్లగా జేబుకు చిల్లుపెట్టు ఎర

కళ్ళను కప్పేసిన కనికట్టు పొర

కల్లబొల్లి ఊసులు వల్లించే పిట్టలదొర

ఆపుటకు ఆస్కారంలేని అయస్కాంతమై ఆకట్టుకునేది

గజదొంగలా సమయాన్ని అమాంతం కొల్లగొట్టేది

ఉప్మాలో జీడిపప్పులా ప్రకటనల నడుమ ప్రోగ్రాములిచ్చేది

న్యాయవాదిలా పనులను ఊరకనే వాయిదా వేయించునది

మానవసంబంధాలను కనుమరుగుచేసి కళ్ళకు గంతలు కట్టేది

ఉత్కంఠతో ఊపిరాపి బీపీ రేపే లవణకేంద్రమిది

నిద్రమాత్రలను సైతం నిర్వీర్యంచేసే నిపుణురాలు

విరుగుడుకు వీలులేని వశీకరణ వేసే వగలాడి

ఊబకాయుల్ని ఉత్పత్తిచేసే కర్మాగారమిది

చిక్కకుండా నేరంచేసే నైపుణ్యాలను నూరిపోసే నేర్పరి

నటనకు ద్రవీభవించి నిజానికి ఘనీభవింపచేసే కిలాడి


-ప్రశాంత్



Rate this content
Log in

Similar telugu poem from Comedy