సముద్రపు గాలి
సముద్రపు గాలి
రోజూ చూసే సముద్రమే
కానీ ప్రతి రోజూ కొత్తే
అచ్చం నీ ముఖంలాగా
నువ్వు నాకు చిక్కకుండా తిరుగుతావు
సముద్రంలోని చేపలాగా
చేపకంటే ఎరేయెచ్చు
లేకుంటే పెద్ద వలేయెచ్చు
కానీ నీలాగా తెలివైన వాళ్ల కోసం ఏం చేసేది
పాదరసం లాంటి బుర్ర నీది
పోనీ నీకు వీపు రుద్దనా
నీ వీపు నీకు అందుతుందే?
హ్మ్
హా సముద్రపుగాలి తెచ్చీయనా
సముద్రపు గాలి సల్లబరిచే వరకూ
మాకు నిద్దర రాదు
ఆ గాలంతే
నీకూ తెచ్చిస్తా
ఎట్టాగబ్బా
నా ఊపిరిలో నింపుకుని వస్తా
కాస్త నీకూ ఇస్తా

