పాత ఫోన్ కొత్త ఫోన్
పాత ఫోన్ కొత్త ఫోన్


రిసీవర్ పట్టుకునే రోజులు అవి
తిప్పి తిప్పి అంకెలు డయల్ చేసేవాళ్ళు
ట్రింగ్ ట్రింగ్ అని వచ్చే శబ్దాల కోసం చెవులు రిక్కించి వినేవాళ్ళు
ల్యాండ్ ఫోను ఉంటే స్టేటస్ సింబల్ అనుకునేవాళ్లు
ఇప్పుడు అర చేతిలో ఫోన్ ఇమిడి పోయింది
టప టపా అని వేళ్ళు స్క్రీన్ మీద నాట్యం చేస్తున్నాయి
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం తప్పనిసరి అని అనిపిస్తుంది
పాత ఫోను ఎప్పుడైనా కొత్త ఫోనుతో మాట్లాడుతుందా