STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Comedy

3  

Venkata Rama Seshu Nandagiri

Comedy

హాస్యానందం

హాస్యానందం

1 min
193


పేరు వినగానే కలిగేను ఆనందం,

మనిషిని చూడగనే కలుగు ఉత్సాహం,

ఆ హాస్యబ్రహ్మే మన బ్రహ్మానందం.

ఎన్నో చిత్రరాజములందు నటించెను,

ఆపాయములను ఉపాయంగా తప్పించు కొనును,

అవసరమైన చోట ఇతరులనుపయోగించు కొనును,

కొందరిని తానే ఉపాయంగా తప్పించి వేయును.

తాను నవ్వక ఇతరుల నవ్వుల్లో ముంచివేయును,

ఇతరులను నవ్వించుటకే తాను జీవించును.

మన తెలుగు భాష యందు పండితుడు,

భాషాభిమానము మెండుగా కలవాడు,

తెలుగు భాషయందు ఒకనాటి ఉపన్యాసకుడు.

వారి నోటి మాటయే, మనకు నవ్వుల పూదోట,

విన్నంతనే ఆనందమున కనులు చెమరించునంట.

వారి మాటల్లో, చేతల్లో హాస్యరసముప్పొంగును‌,

ఎంతటి వారినైనను, తన మాటలతో పడవేయును.


Rate this content
Log in

Similar telugu poem from Comedy