అలా ఎలా
అలా ఎలా


పులిసిపోయిన అట్టులా
పాడయిన ఆవకాయలా
పాడలేని కోయిలలా
ఆడియన్స్ లేని సినిమాహాలులా
సినిమాహాలులో చిరిగిపోయిన కుర్చీలా
ఖాళీ సీసాలా
బీళ్ళు పడిన నేలలా
ఎవ్వరికీ నచ్చని హిట్ ఫిల్మ్ రీమేక్ లాగా
నన్ను మార్చావిలా
మనసు లేని మనిషిలా
ఇప్పటికీ అర్థం కాదు
అలా ఎలా
ఇంకెలా
ఎందుకో ఇలా
నాకు మాత్రమే ఈ విలవిలా