STORYMIRROR

ARJUNAIAH NARRA

Comedy Inspirational Children

4  

ARJUNAIAH NARRA

Comedy Inspirational Children

కోడిమాత ఆత్మకథ

కోడిమాత ఆత్మకథ

2 mins
667

నేను కోడినే కాని....

నన్ను కోడిమాత అనాలి అని డిమాండ్ చేస్తున్న

లోక కల్యాణం కోసం సూర్యోదయం కంటే

ముందే లేచి ఈ ప్రపంచాన్ని మేల్కొలుపుతాను

నేను ఈ లోకానికి 'కొక్కోరోకో' అలారాన్ని

నాకేం తక్కువ, నా జాతి కోళ్లు

బాయిలర్, లేయర్, గిన్నీ, నిప్పు, నాటు

జాతీయ పక్షిలాగా వయ్యారాలు వలకబోస్తాము

అంతర్జాతీయ స్థాయిలో 

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ మా సొంతం 

నేను ఆహారం కోసం మీ మీదనే ఆధారపడను

ఏవో గింజలు పెరట్లోను, ఎదురింట్లోను తింటాను

మీ ఎంగిలి మెతుకులు తిని ఎదుగుతాను

ఆరుబయటనే ఒదుగుతాను, పొదుగుతాను

కమాను కిందే కోడి తల్లిని అవ్వుతాను

కోడిపిల్లగా మీ పిల్లలను సంతోష పెడతాను

కోడిపెట్టగా గుడ్లు పెడతాను 

అంతో ఇంతో ఆదాయాన్ని సమకూర్చుతాను అందుకే 

నన్ను కోడిమాత అనాలి అని డిమాండ్ చేస్తున్న


నేను పుట్టి కాల ధర్మం చేసే వరకు

నీవు పుట్టి చనిపోయే రోజు వరకు

మీ జీవితపు సంఘటనలు 

అన్ని నాతోనే ముడిపడి ఉన్నాయి


ఇద్దరి మధ్య స్నేహం కుదిరిన 

రెండు మనసులు కలుసుకున్న

ప్రేమలో పడ్డా, పెళ్లిళ్లు జరిపినా, 

నెల తప్పినా, శ్రీమంతం అయిన

పురుడు పోసుకున్న,  

పుట్టిన రోజూ చేసుకున్నా

పెళ్లి రోజు జరుపుకున్నా

నా ప్రాణ త్యాగము లేనిది

ఇన్ని కార్యాలు జరుపలేరు


మీకు పిల్లల పుట్టినప్పుడు

అక్షరాబ్యాసం చేసినపుడు 

బడిలో చేరిపించినపుడు 

ఫస్టు క్లాసులో ఫస్టు ర్యాంక్ వచ్చినపుడు

కళాశాలకు వెళ్ళినపుడు

యూనివర్సిటీలో సీటు కొట్టినపుడు

ఉద్యోగం సంపాందించిన

నా ప్రాణ త్యాగము లేని సంఘటన

ఇందులో ఏ ఒక్కటైన ఉందా?


ఇంకా ఉన్నాయి రాసుకో భాయ్!

స్నేహితుల సంతోషంలో సగం నేను!

బంధువులతో బంధుత్వం బలపడడానికి నేను!

నూతన సంబంధాలు కలపడానికి నేను!

బాధలు పంచుకోవడానికి నేను!

ప్రపంచ విందులో నేను!

ఫిల్మ్ స్టార్స్ షూటింగ్ స్పాట్లో నేను!

నాయకుల ఫార్మహౌస్ లల్లో నేను!

రాజకీయాల మీటింగ్ లల్లో నేను!

విదేశీ దౌత్య సంబంధాల్లో నేను!

ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో నేను!

మీ అత్తారింట్లో, మీ అద్దింట్లో !

మీ పక్కింట్లో ! మీ ఎదురింట్లో!

నేను లేని స్థలమేదైన ఉందా?

నేను లేని నీవు ఉన్నవా?


చావుకు, దినాలకు

తద్దినాలకు, నెల మషికానికి

సంవత్సరికానికి, పరామర్శకు,

అపజయాలకు, జయాలకు

ప్రేమను కోల్పోయిన,

లవర్ విడిపోయిన,

విడిపోయినా మనసులు కలుసుకున్న

శత్రువుకు బాధ కలిగిన

మిత్రుడు విడిపోయిన,

నా తల తెగిపడనిదే

నీవు తల ఎత్తుకు తిరగగలవా?


నా గుడ్డుని

సాఫ్ట్ బోయిల్డ్, హార్డ్ బోయిల్డ్

స్క్రoబుల్డ్ ఎగ్, ఫ్రైడ్ ఎగ్

ఆమ్లెట్, పోచ్డ్ ఎగ్, అండ బుజ్జి

అనియన్ ఎగ్, మసాలా ఎగ్

స్పైసి ఎగ్, ఎగ్ గ్రేవీ, ఎగ్ బట్టర్ మసాలా

ఎగ్ కుర్మా, ఆలు అండ కర్రి,

కాడయి ఎగ్ మసాలా

ఎగ్ ఖీమా, ఎగ్ విండాలు

పంజాబీ ఎగ్ మసాలా,

చెట్టినాడ్ ముట్టే మసాలా, 

కేరళ ఎగ్, ఆంధ్రా ఎగ్, హైదరాబాది ఎగ్

ఇలా ఎన్నని చెప్పను 

నేను ఒక్కో రాష్ట్రానికి ఒక రకం పేరును


అయినా నా గుడ్డు తినని 

మీ పిల్లలు, గర్భిణీలు, యవనస్తులు,

వృద్ధులు, రోగగ్రస్థులు, క్రీడాకారులు, 

విద్వాంసులు, విధుషకులు, రాజనీతిజ్ఞులు

శాస్త్రవేత్తలు, ప్రధాన మంత్రులు, దేశాధినేతలు

సినిమా స్టార్స్, ఇలా చెప్పుకుంటూ పోతే

తినని నిపుణులంటు ఉన్నారా ?

లేని రంగంమంటూ ఉన్నదా అందుకే 

నన్ను కోడిమాత అనాలి అని 

నేను డిమాండ్ చేస్తున్న


వర్షాలు పడుతుంటే వేడి పకోడిని

వేసవికాలంలో బట్టర్ చికెన్ ని

చలికాలంలో చిల్లి చికెన్ ని

చికెన్ పులావుని, బిర్యానీని

తాందూరిని, చికెన్ కర్రీని, 

చికెన్ 65ని, చికెన్ వింగ్స్ ని, 

చికెన్ లెగ్స్ ని, చికెన్ లాలిపాప్స్ ని, 

చికెన్ ఫ్రై ని, చికెన్ పులుసుని

చికెన్ రోస్ట్ ని, చికెన్ టోస్ట్ ని, చికెన్ టిక్కని,

నాటు కోడిని, కేఏఫ్ చికెన్ ని ఇలా 

విష్ణుసహస్ర నామాలులాగా నాకెన్నో పేర్లు!


లొట్టలేసుకొని మందులోకి, 

బీరులోకి, వైన్స్ లోకి, బ్రాందీలోకి

విస్కీలోకి, తాటి కల్లు లోకి, నాటు సారలోకి

నన్ను పౌష్టికాహారంగా

వండుకొని దండుకొని తిని 

ఆరోగ్యంగా జీవించమని

దీవిస్తూ మరణిస్తున్నా!

అయినా ఇన్ని అర్హతలు ఉన్న 

నాకన్న ఏ జంతువు మీ మాత కాగలదు!

మీ బడ్జెట్ కి తగ్గట్టుగా 

ఇన్నీ కార్యాలు జరిపి

మీ విజయానికి 

కారణం అవుతున్నది నేను

నేను విశ్వమానవవాలి శ్రేయస్సును కోరిన

అత్యంత అల్పజీవిని అందుకే నాకు

కోడిశాలాలు కట్టి, ముక్కోటి దేవతల్లల్లే

నాకు పూజలు, పాలభిషేకాలు చేయాలి

నన్ను పాఠ్య పుస్తకాలందు చేర్చలని

భారత రాష్ట్రపతి ఉత్తర్వులు ద్వారా

ఈ భారతదేశంలో నన్ను కోడిమాతగా

పిలవాలని డిమాండ్ చేస్తు!

మీ ఆనందానికి ప్రతీకగా 

నా రంగుల తోకను రెప రెపలాడే జెండగా ఎగురవేయాలని అబ్యర్ధిస్తూన్నా! 


జై కోడి    జై జై కోడి   జై జై జై కోడిమాత



Rate this content
Log in

Similar telugu poem from Comedy