STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Comedy Others Children

5  

Thorlapati Raju(రాజ్)

Comedy Others Children

ఆన్లైన్

ఆన్లైన్

1 min
438

ఆన్.... లైన్!👩‍💻


బస్తాల బస్తాల... మోత

నడ్డి విరిగేలా ఫీజుల మోత

పేరా పేరాల బట్టీల కూత

చేతులరిగేలా ఒకటే రాత

ఇదే...

నేటి పసి హృదయాల తలరాత!


అంజనం వేసినా...

ఎక్కడా కాన రాడే...


నేడు..

విలువలు గల విద్యకు

పెద్ద పీఠ వేసే....నేత!

నీతి కథలు చెప్పే...తాత!

గుణ గణాలు ను పంచే...దాత!

నైతికతను నేర్పే... గురు మాత!


అంతరాయానికి చింతుస్తున్నామ్

అంటూ...

అంతా....మార్చేయటానికి వచ్చింది

కరోనా!

కరోనా వచ్చింది కథ మొత్తం మార్చింది


ఆన్లైన్ లో క్లాసులంట...👩‍💻

ఆఫ్లైన్ లో కాల్స్ అంట.📱

గంటకో విషయమంట..

గంట గంటకు..గంట గాప్ అంట!


రెండు కళ్ళు పోయి..

నాలుగు కళ్ళు వచ్చాయంట!🤓

క్లాస్ రూం పోయి..

బెడ్ రూం వచ్చిందంట!

బ్లాక్ బోర్డు పోయి..

బ్లాక్ స్క్రీన్ వచ్చిందంట!

బడి గంట పోయి...

మొబైల్ గంట మోగిందంట


టీచర్ల బెత్తం దెబ్బలు లేవు..

మాస్టర్ల గద్దింపులు లేవు..

మధ్యాహ్నం లంచ్ బాక్స్ లు లేవు..

మధ్య మధ్యలో స్నాక్ డబ్బాలు లేవు.


ఎంత బాగుందో...కానీ!

ఏం చదువుతున్నామో..

ఎందుకు చదువుతున్నామో..

అర్థం కాని.. గందర గోళం

ఇలా...ఇంకెంతకాలం?


అంతరాయం అంతరించక పోదు

కరోనా...కాలం చెళ్లక పోదు!


తర్వాత అయిన...

కథను మార్చండి... తల్లిదండ్రులారా..


మార్కులు.. మనీ నివ్వవచ్చు గానీ

మానవత్వాన్ని కాదు!

గ్రేడ్ లు.. గ్రేట్ జాబ్ నివ్వవచ్చు గానీ

గ్రేట్ పర్సనాలిటీ నీ కాదు!


నాయకులారా..

యెంత కాలం విద్యా వ్యాపారం చేస్తారో

అంతకు పదింతల కాలం..

పాతాళానికి తోసేసిన వాళ్ళు అవుతారు


గుర్తు పెట్టుకోండి..

ఆ పాతాళం లో..

మీ తరాల వారు...ఉండకపోరు!


        ......రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Comedy