STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Comedy Classics Fantasy

5  

Thorlapati Raju(రాజ్)

Comedy Classics Fantasy

Honey..

Honey..

1 min
366

అతి మధురం.. మన తెలుగు!

(మాతృభాషా దినోత్సవం సందర్భంగా)


అమ్మ చేతి వంటలా

అమ్మమ్మ చెప్పే కథలా

ఆవకాయ పప్పులా

చద్దన్నం ఉల్లిపాయలా

చంటిపాప నవ్వులా....


SVR నటనలా

NTR డైలాగులా

ఘంటసాల గాత్రం లా

సాలూరి సంగీతం లా

ఆత్రేయ ఆత్మ లా


వేటూరి పాట లా

శ్రీ శ్రీ పోటు లా

పరుచూరి మాట లా

కె.విశ్వనాథ్ కథనం లా


నెచ్చెలి అలుగు లా

జాబిల్లి వెలుగు లా


పల్లెల్లో దొరికే 

స్వఛ్ఛమైన జున్ను లా


చెట్టుకు ముగ్గిన 

మామిడి పండులా


తండాల్లో దొరికే తేనె లా..

అతి మధురమైనది...

మన తెలుగు......


         ...రాజ్....


Rate this content
Log in

Similar telugu poem from Comedy