STORYMIRROR

Praveena Monangi

Comedy

4  

Praveena Monangi

Comedy

బంగాళ దుంప

బంగాళ దుంప

1 min
382

పిల్లల మనసులు గెలుచుకున్న రారాజు ..!

వేయించిన పలుచటి గుండ్రని ముక్కలంటే మోజు ...!

ఫ్రెంచ్ ఫింగర్స్ ఆహా అదుర్స్ ...!

నీ కుర్మా.... చపాతీకీ సరి జోడీ....!

చక్కెర వ్యాది గ్రస్తులకు నువ్వంటే హడల్ ...!

పిల్లల బుంగమూతికి నువ్వు ఒక మోడెల్ .....!

వెజ్ మేను కార్డ్ లలో అగ్ర స్థానం నీదoటాను ...!

అన్ని ఋతువులలో అందుబాటులో ముందు ఉంటావు ...!

ఇట్టే తయారయ్యే వంటకం నువ్వు ....!

మట్టిలో పoడే మాణిక్యo నువ్వు...!

స్థూల కాయులు నీ జోలికి రాకూడదంటారు .....!

అయినా అందరూ ఇష్టపడతారు...!

అన్ని వంటలలో తలలో నాలుక లా ఉంటావు....!

ముచ్చట గొలిపే వర్చస్సు తో ఆకర్షించే ...!

బంగాళ దుంపని రుచిచూడకుండా ..!

ఉన్నారా ఎవరయినా ....!

కవితకనర్హం కానిదుంటుoదా ఏదయినా...!



Rate this content
Log in

Similar telugu poem from Comedy