STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

పరువు పోటీలు

పరువు పోటీలు

1 min
348

మనిషంత పొడవు టీవీలు కావాలి

పార్కింగ్ ఉన్నా లేకపోయినా కారు కావాలి

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫోను కావాలి

కావాలంటే కావాలి

లేకుంటే మన పరువేం కావాలి


అయ్యో అంత తక్కువ ఫీజులా

ఇంక చదువు చెప్పినట్టే సరి

లక్షలు కుమ్మరిస్తాం అని 

స్కూలు ముందు నిలబడాలి

లేకుంటే మన పరువేం కావాలి


షాపింగులూ పార్టీయింగులూ

ఇంకా వీలుంటే గేమింగులూ

లేకుంటే మన పరువేం కావాలి


అక్షయ తృతీయనాడు గ్రాము బంగారం కూడా కొనలేక 

మరుసటి ఏడుకు కోరికలను మార్చుకునే బ్రదరూ!

నీ జీతం చీమ తలంత

ఖర్చులేమో ఏనుగు శరీరమంత


తరాలు మారినా తారలు రాలినా

మన మధ్యతరగతి కుటుంబాలకి

తప్పవుగా ఈ పరువు పోటీలు

పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు

అని చురక అంటుకునే సందర్భాలు

ఏదో అలా కానిచ్చేద్దాం బ్రదరూ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract