ముక్తి దీపం
ముక్తి దీపం
మనసులోని చీకట్లను కాల్చింది వెలుగుల దీపం,
తనువులోని మొహాలను చంపింది భక్తిదీపం,
వసంతపు శోభే అవనికి అందం,
జ్ఞానజ్యోతి పులకింతే ఆశాదీపం,
చంద్రవదన కాంతులతో మనసు దివ్యానందం
ప్రణయ కథలో రాగసుధలే అనురాగాదీపం,
తొలకరి జల్లుతో చిగురుతొడిగింది తరుణి
వికసిత కమలపు బ్రతుకే పులకింతల ప్రేమదీపం,
సత్యము ధర్మమే జగతికి దైవము
కోరికలులేని భక్తే ప్రాణదీపం,
ఆరాధనలను పల్లవించే శ్రీనివాస
అల్లాఈశుడు ఒక్కటంది ముక్తిదీపం.
