STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నదీ

నదీ

1 min
10

ఎక్కడో కొండ కోనల్లో పుట్టి 
అప్పుడే పుట్టిన బిడ్డలాగా
చిన్న నడకతో ప్రారంభమై 
ఎత్తు పల్లాన్ని ఎరుగుతూ 
గల గలల సవ్వడితో
మృదుమధుర సంగీత
ధ్వనిని తలపించేలా ఉరుకుల
పరుగుల వేగంతో మాట 
వినని మనసులాప్రవహిస్తూ
రాయి రప్పని తడుముతూ
ఆగని పయనంలా 
వచ్చీ రాని వయసులా 
చూపరులకి చూడ ముచ్చట
గొలుపుతూమధ్య వచ్చేటప్పటికి 
మనో రంజిత మందాకినీలా
యవ్వనపు పాల పొంగులా 
ఉరకలేస్తూ రుచి చూడ
తియ్యటి నీరు ఓషదాల గనిలా
నదీ వంపులా సాగుతూ 
చిరకాలం ఎదురుచూస్తూన్న
సఖుని చేరువ కోసం తపిస్తూ 
చివరికి తీరాన్ని ముద్దాడుతూ
అలనై ఎగసే కెరటమై తరంగమై
కడలిని కలిసి తరియించనా 

        


Rate this content
Log in

Similar telugu poem from Classics