STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

రాలేపూల రాగమేది

రాలేపూల రాగమేది

1 min
0


రాలిపోయో పువ్వుకు
ఎందుకిన్ని రంగులో?
ఒక్క రోజు బతుకుకు 
ఎందుకింత హొయలో ?
ఎక్కడో పూసిన పువ్వుకు 
అంతటి అందమెందుకో ?
క్షణ కాలంలో రాలే పూల రాగమేదైతే 
నేమి మనసును కలవరం తప్పదు 

జీవితమొక మాయని తెలుసుకోము
పాశాలు ఒక నటనైనా 
అశాశ్వతమేనని గురుతెరగము;
 మనసు కొమ్మకు ఈ బంధాల 
అల్లికలు ఎందుకో?
మనిషికి తనివి తీరని
తపనలెందుకో ? ఈ మోహాలు 
దాహాలు క్షణకావేశాలేగా!

ఈ పొద్దు గడిచేనా మలిపొద్దు కాసేనా ?
పేరాశ నిండిన బతుకుల్లో వెన్నెల కురిసేనా? 
ఎందుకిన్ని ఆశలో, యవరికై చింతలో ?
పేగు బంధాలు సైతం భారమని 
దూరాలు పయనమై పోలేదా?
గాయాల గతమెంత ఉన్నా ,
తలకొరివి పెట్టే తనయుడు రాకున్నా,
తులసి నీరు గొంతు దిగకున్నా,
తలకాడ దీపం కొడిగట్టకున్నా 
కనికరమెరగని మరణాన్ని 
కౌగిలించక తప్పదు 

క్షణికమైనది ఈ జీవితం ఏ జీవికైనా,
వాసన లేని గడ్డి పువ్వుకైనా,
సుగంధాలు పంచే పుష్పానికైనా
పదుగురికు మంచిని పంచే వారికైనా 
తప్పదు తుది వీడ్కోలు 


Rate this content
Log in

Similar telugu poem from Classics