STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

శ్రీరాముని

శ్రీరాముని

1 min
4


గురువుతోటి కలిసుండీ..తనజాడను పట్టవేల..!?
శ్వాసలేక కలవేమిటి..ఎఱుకగాను ఉండవేల..!?

మనసుతోటి మమేకమై..రోదించే బ్రతుకేనా..
ఆలోచన మూలమేదొ..అందగాను చూడవేల..!?

నీవెవరో తెలియకుండ..ఎన్నిమార్లు పుట్టినావొ..
నీ ఆశలు కోరికలకు..సెలవివ్వగ తలచవేల..!?

బుద్ధిజీవి నంటూనే..మతిమాలిన పనులెన్నో..
కర్మసాక్షి నిలిచి బ్రతుకు..వెలుగువిద్య అందవేల..!?

కరిగిపోని తరిగిపోని..సౌందర్యం ఉందేమిటి..
ప్రశ్నించే శ్రీరాముని..నీహృదిలో నిలుపవేల..!?

సర్వవ్యాప్త చైతన్యం..మాయకింత చోటిచ్చెను..
ఈ 'నీ-నా' రంగులన్ని..తెలివి కలిగి జరుపవేల..!?



Rate this content
Log in

Similar telugu poem from Classics