జీవితం
జీవితం
జరిగే మారణహోమం..మేలేదో చేయునులే..!
శాంతికి గాక దేనికీ..చోటంటూ ఇవ్వదులే..!
పంతాలను కూల్చివేయు..క్షిపణులెలా ఉంటాయో..
అధికారపు వ్యామోహం..రాలిపడక తప్పదులే..!
పెంచిన రక్షణ వలయపు..ఎఱుక ఇంత జారిందా..
పిశాచాల స్వర్గంలా..ఈపుడమియె మిగులునులే..!
ప్రగతి వనరులపై అస్త్రప్రతాపం ఫలితమేమిటి..
పచ్చదనం కరువైతే..మనుగడకే తిప్పలులే..!
కులాలు మతాలు జాతులు..కలిసే బ్రతికే విధమది..
దైవమెవరో వచ్చేసి..ఎవ్వరికీ నేర్పడులే..!
మంత్రాలో తంత్రాలో..విద్యలెన్ని ఉంటేనేం..
జ్ఞానోదయమే పొందక..చెలిమివిలువ అందదులే..!
