ఏదో వెలితి
ఏదో వెలితి
పరుగెత్తుతాం, విజయానికి అడుగు దూరంలో ..
శక్తినిండా పోరాడుతాం, కింద పడిపోతాం..
పరీక్షలు రాస్తాం, నంబర్ వన్ ర్యాంకు రాదు..
మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇలాంటివెన్నో
తిరిగి పుంజుకోవడానికి వినియోగిస్తే విజయం వైపు
ఏదో వెలితి పీడిస్తే మానసిక సంఘర్షణ
దారి తప్పితే ఓటమి నుంచి మరింత ఓటమి వైపు
ఏదో ఒకటి రుచి బాగా లేదని నస
అయినా కడుపునిండా మెక్కుతాం
అందమైనది పక్కనున్నా మరింత అప్సరస కనిపిస్తే
మన పాట కన్నా మరింత మంచిగాత్రం వినిపిస్తే
అసంతృప్తి పాఠమై గుణపాఠం నేర్పితే
కత్తెరను సాన పట్టినట్లు శరీరాన్ని తీర్చిదిద్దుకుంటాం
ఉన్నదాంట్లో, లభించిన దాంట్లో పొందకపోతే సంతృప్తి
ఏదో వెలితి ముళ్ళు పొడుస్తూనే ఉంటది
కవిత రాస్తుంటాం, మధ్యలో ఎన్ని కొట్టివేతలో
నచ్చనివన్నీ చెత్తబుట్టకెక్కించి
కొత్త పూలు దారంతో కుట్టి అర్థవంతం చేస్తాం
మనసు కుదురుగా లేనప్పుడు
మనం రాసింది మనకే నచ్చదు
రాయాల్సిన పదం నాలుక కిందనే ఆగిపోతే
ఆగుతాం, ఆలోచిస్తాం, తిరిగి కలం కదిలిస్తాం
ప్రతి రంగంలో ఏదో వెలితి పీడిస్తూనే ఉంటది
రోడ్డంతా సజావుగా ఉందనుకున్నప్పుడు
వేగం పెరిగి ప్రమాదాన్ని ముద్దాడవచ్చు
రెప్పపాటు పొరపాటు చాలు
సరిదిద్దుకోలేనంత వెలితి ఏర్పడవచ్చు
ప్రతిక్షణం మనల్ని మనం చెక్ చేసుకుంటూ
ఎదుటి గమనాలు అడ్డుపడకుండా చూసుకున్నప్పుడే
గెలుపు కొంత ఆలస్యమైనా ఇస్తుంది ఆత్మసంతృప్త
