మౌనరాగం
మౌనరాగం
అనుకోకుండా అనుకూలమైన
అపురూప ప్రియ నేస్తం కలిస్తే
అనుబంధం తాజా పరిమళమై
ఆనంద వల్లరిలో అభిమానం అనన్యమై..అనురాగం
అభిషేకము చేస్తూంటే...
ఆ అపూర్వ మధురానుభూతి
వెల్లువై .....అంచులు అధిగమిస్తే..
పలుక లేని మౌనం..ఆ చేరువలో
మోహనంగా స్పందిస్తూ ఉంటే..
అమూల్య...మైత్రీ పరవశా ల
తన్మయం లో...అది
అమిత మనోజ్ఞ స్నేహ/ప్రేమ సంగమమే
అనిర్వచనీయమైన రాగ బంధమే..
