STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నా యుద్ధం

నా యుద్ధం

1 min
11


యుద్ధానికి కాలుదువ్వు..ద్వేషంపై నా యుద్ధం..!
తెలివిలేక మిడిసిపడే.. రాగంపై నా యుద్ధం..!

కలుపుకు బ్రతికే తీరది..నేర్పు కళాశాల లేవి..
జవాబుగా నిలువలేని.. జ్ఞానంపై నా యుద్ధం..!

ఎర్రసిరా వర్షించే..విప్లవాగ్ని కలమేదోయ్..
మూర్ఖతతో రెచ్చిపోవు..వాదంపై నా యుద్ధం..!

నాదేదో నీదేదో..మనదంటూ ఉందేమిటి..
నీళ్ళకొరకు నూనెకొరకు..యుద్ధంపై నా యుద్ధం..!

పరిరక్షణ శక్తులనే..పరిమార్చే క్షిపణులేవొ..
నిలువరించ చేతకాని..తంత్రంపై నా యుద్ధం..!

విచక్షణకు బలమిచ్చే..విశ్వజనని తోడున్నది..
మౌనపురుచి చూపలేని..శోకంపై నా యుద్ధం..!


Rate this content
Log in

Similar telugu poem from Classics