STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పగలు రేయి

పగలు రేయి

1 min
1


ఉండనిమ్ము నన్నిలాగ..నీ ఎదురుగ పగలు రేయి..!
నిత్య దీపసుధను గ్రోల..ఒకచూపుగ పగలు రేయి..!

లేదు భక్తి, అనురక్తియె..కలిగి లేను వెర్రితప్ప..
వెలుగునదీ సాక్షియైన..ఓ తేఱుగ పగలు రేయి..!

రాలిపోగ సిద్ధమైన..పారిజాత మీ మేనోయ్..
నీ వెచ్చని శ్వాసలలో..ఓ మెఱుపుగ పగలు రేయి..!

తపమేదో జపమేదో..సలుపు తెలివి లేదు అసలు..
ఉపవాసమె కోరుకొందు..ఓ వరముగ పగలు రేయి..!

చీకటులను మసిచేసే..వేదాగ్నియె నీ హాసం..
తిలకిస్తూ కరిగిపోదు..నీ'నేను'గ పగలు రేయి..!

ఉడికించే చిత్రసీమ..తుంటరిదని అనజాలను..
కలలకథా కావ్యమయే..అక్షరముగ పగలు రేయి ..


Rate this content
Log in

Similar telugu poem from Classics