నేనెందుకు
నేనెందుకు
నీ చూపుల వెన్నెలలో..కాలిపోని నేనెందుకు..!?
నీ ప్రేమకు దాసుడిగా..బ్రతికిపోని నేనెందుకు..!?
వేదించే ప్రశ్నలింట..కాపురమేం కాపురమో..
నీ పదముల చేమంతిగ..చేరిపోని నేనెందుకు..!?
చెలి పలుకుల వీణనేలు..నాదానికి ప్రాణమేదొ..
నా అను భావనా ఝరియె..ఆగిపోని నేనెందుకు..!?
అనుభవాల గృహసీమన..మాటాడని రామచిలుక..
నీ చెలిమికి అద్దంలా..మిగిలిపోని నేనెందుకు..!?
ఎఱుకగాను మారినంత..మాయకింక చోటెక్కడ..
అంతా అన్నీ నేనై..ఉండిపోని నేనెందుకు..!?
ఈ విగ్రహ మోహంలో..జన్మలెన్ని ముగిశాయో..
అనుబంధపు గంధనగరి..దాటిపోని నేనెందుకు..!?
