STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీ మనసే

నీ మనసే

1 min
0



సరిగ సిగ్గు పడకుండా..నేర్చుకొనుట కుదరదులే..!
తల ఎత్తుకు తిరిగేందుకు..శిరసొంచక తప్పదులే..!

మల్లెతనం ధనమైతే..లోటుండదు ఏ వేళా..
మహా ఇష్టపడినప్పుడు..కష్టమింత తోచదులే..!

ఒక వర్షా మేఘంలా..నీ మనసే మిగిలిందా..
శాంతి కొరకు వెతికేపని.. ఏమాత్రం ఉండదులే..!

దారేదీ లేనపుడే..అడుగు ముందు కేయాలోయ్..
సాహసమను దీపం పై..ఏ చీకటి దూకదులే..!

కాలంతో పోటీపడి..గెలవాలని ఏం చూస్తావ్..
ఆటకు ఓ సాక్షివైన..ఓటమియే కలగదులే..!

పంచిపెట్టు గుణంకన్న..మంచిగుణం ఏదో మరి..
అనుభవాన గాకుండా..సత్యమింత వెలగదులే..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics