STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

దీపావళి

దీపావళి

1 min
2


నడుస్తున్న దీపంలా..జీవిస్తే దీపావళి..!
చెలిమనసున నవ్వుపూలు..పూయిస్తే దీపావళి..!

మాటల కత్తుల విసిరే..పనికన్నా హింస ఏది..
నీ నరకుని సంహారం..జరిపిస్తే దీపావళి..!

ఆలయాల చుట్టూరా..ఎన్నిమార్లు తిరిగేవట..
అక్షరాల సాక్షి నదిగ..ప్రవహిస్తే దీపావళి..!

సరిహద్దుల యుద్దాలేం..శాంతివిందు చేసేనట..
అధినేతల బుద్ధి సరిగ..వికసిస్తే దీపావళి..!

అనుచితమగు ఉచితాలను..ఎరవేసే ఏలికలా..
మేధావుల సూచనలను..పాటిస్తే దీపావళి..!

సేవ ముసుగులో సాగే..దోపిడీల మాటేమిటి..
స్వార్థ పిశాచాల ఆట..కట్టిస్తే దీపావళి..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics