గుండె గంట
గుండె గంట
పచ్చదనం కాపాడగ..పిలుస్తోంది గుండెగంట..!
భువికి స్నేహమాధురినే..పంచుతోంది గుండెగంట..!
సమయానికి స్పందించే..గుణప్రదయె గమనిస్తే..
వెన్నుతట్టి ప్రోత్సహించ..మోగుతోంది గుండెగంట..!
మేధావిని నేనంటూ..విర్రవీగు పనేమిటోయ్..
జన్మలుగా ప్రగతిదిశగ..నడుపుతోంది గుండెగంట..!
రసవత్కవితా చందన..వారాశియె తానంటా..
అక్షరాల గగనసాక్షి..నిలుపుతోంది గుండెగంట..!
నిత్యమేఘ రాగమాల..సొగసులెలా వర్ణించను..
చూపలేని ప్రేమసీమ..ఏలుతోంది గుండెగంట..!
ధర్మమర్మ మెఱుకపరచు..లోహితయే గమనిస్తే..
కాలచక్ర భ్రమణంలో..నలుగుతోంది గుండెగంట..!
