మువ్వలు
మువ్వలు
బంగారు మువ్వలు పాదాల రవళించా
గుండెంత తుళ్ళింత మనసంత పులకింతా
మురళీ మురళీ రవముల మనసును మైమరపించీ
తరుణీ రమణీ సొగసులు వలపుల మదినలరించీ
మురారి మయూరి పదముల మువ్వలసడి వినిపించా
రాధే రాధేశ్యాముడనీ జనులకు నినదించా
అడుగులకూ మడుగులొత్త పన్నగమూశయనమొప్పె
పలుకులకూ వొంతపాడ పాంచజన్య మొచ్చిచేరె
సూచనలకు కట్టుబడా సుదర్శనము సొంతమాయె
సరిలేరని పొగడ్తలా నందకమూ నొందినాను
కౌముదినీ రాధజేరి కౌమోదకి పొందినాను
క్షీరాబ్ధిని వైకుంఠం నిలిపినాను పొందికగా
పరిపాలన నాదిగాని పర్యవేక్ష పరమేశ్వరి
పరంజ్యోతి పరంతపా కారుణ్యపు కమలనేత్రి
శాంభవిగా శార్ఙ్గంబిడి సంతసింప జేసినది
జగతినేలు నాయకత్వ మిచ్చితాను మురిసిందీ
మాధురిగా మనువునాడి పులకరింప జేసినదీ
తననుయేలు అధిపతిగా నియమించీ వెలసిందీ
