హృదిలోని
హృదిలోని
నీ పేరే శుభ మంత్రం..దాచుకొందు హృదిలోనే..!
నీ రూపం అపురూపం..దాచుకొందు హృదిలోనే..!
అలరించే పసిడిపూల..తేనెపాట పాడుకొందు..
నీ బంగరు సుమహాసం..దాచుకొందు హృదిలోనే..!
అనురాగపు రాగాలకు..స్వరములేల కూర్చుకొందు..
నీ వలపుల నవరాగం..దాచుకొందు హృదిలోనే..!
మధుర భావనా వీధుల..విహరించే బలమిస్తివి..
నీ మౌనపు జయగీతం..దాచుకొందు హృదిలోనే..!
నా తియ్యని లోకాలకు..అధిదేవత ఇంకెవ్వరు..
నీ ప్రేమకు నిజదీపం..దాచుకొందు హృదిలోనే..!
కురుస్తున్న వాన సాక్షి..నిలుపుతున్న కోమలివే..
స్వచ్ఛమైన నీ స్నేహం..దాచుకొందు హృదిలోనే..
