STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

గులాబీకి

గులాబీకి

1 min
2


ఏ గులాబి ఇవ్వగలను..కరుణించని గులాబీకి..!
కబురులెలా చెప్పగలను..కనులెత్తని గులాబీకి..!

ఎండ మండి పడినట్లే..ఉంది కదా ఈ విరహం..
మనసునెలా చూపగలను..ఇటుతిరగని గులాబీకి..!

మంచుమబ్బు వస్తుందను..ఆశ ఏది లేదిప్పుడు..
అలుకనెలా తీర్చగలను..దరిచేరని గులాబీకి..!

నా తలపులు మౌనముగా..పండించే కోమలియే..
సౌఖ్యమెలా కూర్చగలను..వేదించని గులాబీకి..!

ప్రాణాలకు ప్రాణమైన..నెచ్చెలియే జన్మలుగా..
మధువెలాగ పంచగలను..హృదివీడని గులాబీకి..!

నేనేమిటొ నాదేమిటొ..తేటపరిచె చెలిమిమీర..
కృతజ్ఞతేం తెల్పగలను..మరి వాడని గులాబీకి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics