జీవితం
జీవితం
వారేమో అందురులే..అదే వారిపని పోనీ..!
ఎంచుటనే చేతురులే..ఆదే వారిపని పోనీ..!
నీ పని హాయిగ చేసే..దిశగా అడుగులు పడనీ..
రాళ్ళేవో వేతురులే..అదే వారిపని పోనీ..!
ధైర్యం సహనం తోడుగ..ఉంటే ఎదురే ఉండదు..
కలహించగ దిగుదురులే..అదే వారిపని పోనీ..!
స్నేహం పెంచే తత్వం..మదిలో నిండిన మేలోయ్..
దారికడ్డు పడుదురులే..అదే వారిపని పోనీ..!
నీ ప్రతి గాయం తియ్యని..గేయం ప్రేమకు రూపం..
ప్రాణాలను తీతురులే..అదే వారిపని పోనీ..!
నీ ప్రతి భావం ప్రగతికి..మెట్టుగ చేస్తూ కదులోయ్..
వారు కూల్చ చూతురులే..అదే వారిపని పోనీ.
