STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనసు కథ

మనసు కథ

1 min
1


రాగంతో తియ్యబడే..మనసు కథే నీ సినిమా..!
మౌనంపై తిరగబడే..మనసు కథే నీ సినిమా..!

నీవు కోరుకోకుండా..పుట్టలేదు భూమిమీద..
నీ ఎంపిక చక్కబడే..మనసు కథే నీ సినిమా..!

నీ కర్మల సంచితోటి..దిగబడినది మరచితివోయ్..
'నేను-నాది' ఎగరబడే..మనసు కథే నీ సినిమా..!

మరపు వరం కావచ్చును..ఎఱుక మించి నేస్తమేది..
పెను ఆశల చుట్టబడే..మనసు కథే నీ సినిమా..!

మాయపట్ల వ్యామోహం..మరుజన్మకు తావిడునే..
అనుభవాలు చెక్కబడే..మనసు కథే నీ సినిమా..!

అజ్ఞానం పెట్టుబడిగ.. సాగుతున్న వ్యాపారం..
వ్యవహారం నింపబడే..మనసు కథే నీ సినిమా..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics