కరుణతో దానం సంస్కృతి
కరుణతో దానం సంస్కృతి
పద్యం:
ఆకలి యని తినుట అన్నము ప్రక్రుతి,
ఆకలి యని జూచి అపహరించి
నను వికృతి, కరుణతొ దానము సంస్కృతి
పలుకులమ్మ దివ్య భారతాంబ
భావం:
తల్లీ భారతీ! ఆకలిగా ఉంది అని అన్నం తినడం ప్రకృతి, ఆకలిగా ఉంది అని దొంగిలించి తినడం వికృతి, ఆకలి గా ఉన్నవారి పట్ల కరుణతో దయ చూపి దానం చెయ్యటం సంస్కృతి.