సాయి చరితము
సాయి చరితము


ప:గురువు నీవు సాయీ
సద్గురువు నీవేనోయీ
నిన్ను తలచిన చాలు
అన్ని భయములు పోవు
చ: జన్మకర్థము తెలియదు
జన్మసార్థకము నీవుగా
చరిత చదివిన చాలుగా
భవిత మము బాధించదు
చ: నీ నామస్మరణము మాకు
సకలపాపహరణమూ
నీ లీలలన్నియు మాకు
దారిచూపును భాగ్యమై
చ: నిన్ను తలిచిన చాలును
ఏ పుణ్యఫలము వలదుగా
ఎన్నిజన్మలబంధమో ఇది
మమ్ముగాయుమ సాయిదేవా