STORYMIRROR

Sita Rambabu Chennuri

Drama

4  

Sita Rambabu Chennuri

Drama

భూపాలరాగం

భూపాలరాగం

1 min
495

భూపాలరాగం


చుట్టూ ఆవిష్క్రతమవుతూ దృశ్యం ఒకటి

మనసు దోచుకుంటోందా...కలవరపెడుతోందా...

ఆకాశం కంట కన్నీరు రైతుకు శాపమంటున్నాడో మనిషి


చీకటి చీల్చే ప్రయాణంలో ఒంటరితనం 

నావచుక్కానిలాంటిదే...

ముసిరే జ్ఞాపకాలను చెదరగొట్టే ధ్వని తరంగం

తీతువుకూతలానో వాహనాల రొదలానో వెంటాడుతుంది...


అంతేలేని గమ్యంలా ఆలోచనలు తెగవు

తెగులుపట్టిన పత్తిచేలు రైతుకు దుఖాన్నిచ్చినట్టు

దిగులు మేఘాలు కప్పుకున్న మనో ఆకాశం

అమావాస్య చీకట్లను దాచలేకపోతోంది...


ఏదైతేనేం పయనమాగదు...పాట పల్లవీ ఆగదు..

పారేఏరులా జీవితం పరుగాపదు

క్లేశాలు కోపాలు వచ్చేపోయే వర్షపు మేఘాలే

సంబరమో అంబరమో పలకరిస్తూనే ఉండాలి...


సంశయమో అతిశయమో తినేస్తున్నవేళ

నేతగాడినల్లుకునే పడుగూ పేకలా

పకపకనవ్వులే ఆలోచనల కలుపునేరేస్తుంటే

కళ్ళనిండా తన్మయత్వపు తడి

మూగపోయిన గుండెలో భూపాలరాగమవుతుంది


Rate this content
Log in

Similar telugu poem from Drama