భయపడకు
భయపడకు


జనతా కర్ఫ్యూ
ఒక ప్రయత్నం.
జన జాగ్రత్తలే
మన భాగస్వామ్యం.
అందరమూ కలిసే...
ఉన్నామనడానికే
విడి విడిగా ఉందాం
ఐక్యత చాటుదాం.
ఆదివారం ఇంట్లోనే
ఆరోగ్యం ఆనందం
జనతా కర్ఫ్యూ విజయం
ప్రపంచానికి ఆదర్శం.
నమస్కారం సంస్కారం
సలామ్ మాలిక్కిమ్
మాలిక్కిమ్ సలామ్ ముద్దు
షేక్ హ్యాండ్ వద్దే వద్దు.
కరోనా వైరస్ చెడ్డదే... కానీ
వైరస్ సోకిన వ్యక్తికాదు
నైతిక మద్దతు ఇద్ధాం...వ్యక్తి
కోలుకోడానికి సహకరిద్దాం.
కౌంట్ డౌన్ మొదలు
ఈ ఆదివారం స్పెషల్
నో...టు నాన్ వెజ్ ప్లీజ్
ఎస్ టు సాంబారు రైసే నైస్.
ఎన్నాళ్లకో.... ఈ ఏకాంతం
కుటుంబం కష్ట సుఖాలూ...
కలి'విడి' కబుర్ల కలబోతలు
ఇదో అవకాశం ఆనందం.
చేతులు కడుగుతుంటే...
కరోనా కకావికలం
వ్యక్తిగత పరిశుభ్రతే...
దివ్యౌషధం మనకు శరణ్యం.
కేర్ ఫుల్ సండే డెఫినిట్లీ...
హ్యాపీ మండే..హోప్ ఫుల్లీ...
బీ రడీ వన్ టూ త్రీ... స్టార్ట్
సెల్ఫ్ సపోర్ట్ జనతా కర్ఫ్యూ....!
....ఎం.వి.స్వామి