STORYMIRROR

M.V. SWAMY

Others

4  

M.V. SWAMY

Others

కోటి ఆశయాల వాణి

కోటి ఆశయాల వాణి

1 min
145

కోటి ఆశయాల వాణి ఈ నవ తెలంగాణా!

……………………………………….


అనుకున్నది సాధించడమే కాదు

అభివృద్ధి ఆశయాల సాధన వైపూ

దూసుకుపోతున్న నవ తెలంగాణా!

కోటి ఆశల కొంగ్రొత్త తెలంగాణా…

శతకోటి ఉద్యమాల ఫలితమది!

రాళ్లను తవ్వి రతనాల పండించి

బీళ్లను దున్ని నవధాన్యాలను పెంచి

ప్రపంచానికి పంచుతున్న పుణ్యభూమి!

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే సామెత

ఇక్కడ కాదు మరెక్కడైనా అంటూ…

విశ్వ వినువీధుల్లో తానూ ఓ నక్షత్రం!

ఎదుగుతూ ఎదిగిన కొద్దీ ఒదుగుతూ…

ఒడుదుడుకుల నావను ఒడ్డుకు చేర్చుకొని

ఒడుపుగా ముందుకు వెళ్తున్న తెలంగాణా

కోటి రతనాల వీణ మాత్రమే కాదు

సమిష్టి కృషిఫల సుసంపన్న ప్రజా మేళా!

ఉన్ననాడూ లేనినాడు ఓర్పుకూర్పులతో

ఓదార్చి ఒడిలో పెట్టుకున్న ఆ నేల…

చరిత్రమొత్తం సత్ సంప్రదాయ హేళ!

సంస్కృతి సాహిత్యం పట్టుగొమ్మలు

మంచితనం మానవత్వం మనుషులందరు

ఆత్మాభిమానం ఉట్టిపడే నినాదాలు

అభివృద్ధికి కట్టుబడే విధానాలు

అదే నేటి సర్వ సత్తాక తెలంగాణా రాష్ట్రం!

పొరపాట్లను సరిదిద్దుకొని సంఘితమైతే

జై తెలంగాణా జయహో తెలంగాణా!

…………………………………….


       ఎం వి స్వామి

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత

      చోడవరం విశాఖ జిల్లా

        9441571505



Rate this content
Log in