STORYMIRROR

M.V. SWAMY

Others

4  

M.V. SWAMY

Others

తెలంగాణ ప్రజా జీవనం

తెలంగాణ ప్రజా జీవనం

1 min
337

ప్రత్యేక తెలంగాణాలో ప్రజా జీవితం

.................................................


కోటి ఆశల కొంగ్రొత్త తెలంగాణ

శతకోటిఉద్యమాల ఉప్పెన ఫలితం!

ఆత్మాభిమాన యాగంలో...ఆ

తెలుగువీరులదే అంతిమవిజయం!

రాళ్లను దున్ని రతనాలను పండించి

బీళ్లను దున్ని నవధాన్యాలను పెంచి

ప్రపంచానికి పంచే స్థాయికి ఎదిగి

ఎడిగినకొద్దీ ఒదిగివుండే ప్రజలతో

నిండుగా నిత్య పండగ ఈ నేల!

వైవిధ్య సంప్రదాయ భాగ్యనగరం

విశిష్ట చరిత్రకు ఓరుగల్లు కోట

పరిపుష్ట సుందర రతనాల వీణ

నేడు తెలంగాణా చైతన్యవాన!

సంస్కృతి సాహిత్యం పట్టుగొమ్మలు

సేవాగుణం చేతనైన సాయం గుణం

తెలంగాణీయుల సర్వ సుగుణం

ఉన్ననాడు మిడిసిపడక

లేనినాడు కృంగిపోక

కలిమి లేముల కావిడి కుండల్ని

సరిసమానంగా మోసుకుపోతున్న

సానుకూల దృక్పథ సామరస్యం!

పరుగులెడుతున్న నిత్య కర్షకి

కార్మికలోక నిండు జవ్వని

భారతీయ వైశిష్ఠ నవోదయ మువ్వ

నేటి తెలంగాణా ప్రజా జీవన జువ్వ!


.............................................


ఎం వి స్వామి

9441571505


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్