M.V. SWAMY

Inspirational Classics

4.5  

M.V. SWAMY

Inspirational Classics

మారాలిరా మనిషి తీరు!

మారాలిరా మనిషి తీరు!

1 min
336


మారాలిరా మనిషి తీరు!


…………………………………..


నేటి మనిషి మారలేదు అతని

తీరులో మార్పు రావడం లేదు!

ప్రకృతిని తన వికృత చేష్టలతో

అతలాకుతలం చేస్తున్న

మనిషి తాను కూర్చున్న కొమ్మనే

నరుక్కుంటూ అధోగతికి

పడిపోతున్నాడని తెలిసి తెలిసి

తెలివిమీరు తప్పటడుగులేస్తున్నాడు!

అధిక జనాభా దేశంలో…

అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన 

మనిషి నిర్లక్ష్యంతో…

వ్యవస్థ మొత్తాన్ని నీరుగార్చుతున్నాడు

పాలకులను ప్రశ్నించే మనిషికి తన 

వ్యక్తిగత,సామాజిక బాధ్యతలు తెలీవా!

బయిటకెళితే మోటార్ సైకిల్…

మరికొంచెం దూరమైతే కారు…

నడిచిపోవుట నామోసి..

సైకిల్ తొక్కుట చిన్నతనం!

మాటమాటికీ సెల్ ఫోన్…

చిన్న చిన్న పనులకీ యంత్రాలే…!

చెట్టు పెంచుటకు బద్ధకం…

పచ్చదనం పాడుచేయుటలో 

తెగ హుషారు…ఆలోచనా రాహిత్యం!

చేను పెంపకంలో రసాయనికం

అడ్డుదారిలో ప్రతిఫల ఆశయం!

మట్టిరోడ్డు వద్దు సిమెంట్ రోడ్ ముద్దుట!

ప్లాస్టిక్ పిపాశులు…

భూమి పొరల్లో ప్లాస్టిక్ పరదాలు పరిచి

ప్రాణాలను నిలుపుటకు…

నీరు కావాలంటారు భూమి నుండే…

సమస్తం రావాలని కోరుకుంటారు!

నీతులు చెప్పేవారు కోకొల్లలే

పాటించడానికి ముందుకు రారు 

జర పాటించండని పక్కవారిని కోరతారు!

అడుగడుగునా… స్వార్ధం

పరనింద బాధ్యతా రాహిత్యం!

ప్రపంచంపై నిరసన ధ్వజాలు

అధిక జనసాంద్రత దేశంలో….

అందరి ఆరోగ్యం అందరి బాధ్యతని తెలిసినా

ఇగోలు…నిజాలను తొక్కేసే ఇజాలు!

ప్రాణాంతకమని తెలిసినా…

బయట తిరుగుతాడు…పక్కవాడిపై

రాళ్లు విసిరి తన గాయాలకు…

ప్రపంచమే కారణమంటాడు…

నేటి మనిషి మారలేదు…

అతని తీరులో మార్పు రావడం లేదు

చేతులు కాలాక ఆకులు పట్టుకొని

తన తప్పిదాలను…

పక్కవారికి పులిమే బాపతులే ఎక్కువ!

నిబంధనలు అమలు చేసుకుంటే

స్వీయ నియంత్రణకు నడుము కడితే

శుభ్రత పాటిస్తే పోయేదేమీ లేదు

ఆరోగ్యం వుంటుంది ఆనందంగా వుంటుంది!

మనిషి మారాలి తన తీరు మార్చుకోవాలి!

మారాలిసుమా... మనిషి…

మార్పు తేవాలిసుమా... బాధ్యత తెలిసి!

……………………………………..


ఎం వి స్వామి 9441571505







రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్