STORYMIRROR

M.V. SWAMY

Others

4  

M.V. SWAMY

Others

పొగ తాగటం మానండి

పొగ తాగటం మానండి

1 min
328

పొగ త్రాగకురా బాయ్…!

……………………….


మజా ఇచ్చిన మత్తు

ప్రజా నెత్తిన చిచ్చు

ఊహించుకో ఆ వుచ్చు

అదే పెద్ద కొండముచ్చు!

ఉంగరాలు తిరిగే…

పొగాకుపొగ అనారోగ్యసెగ

పడుతుంది ఆరోగ్యానికి పగ!

గుండె నిండా ఆ వెచ్చదనం

పెంచుతుంది మృత్యుగుణం!

అడ్డపొగ…నిడువుపొగ

పేరేదైనా...తీరేదైనా…

పొగత్రాగుట ప్రాణహాని

కాదేమాత్రం 'హనీ'....!

ముక్కులోంచి పొగ 

పీల్చేవాడొకడు...ఇక

చెవులుగుండా కూడా…

వదిలి విర్రవీగేవాడు మరొకడు!

పొగాకు నమిలి నవనాడుల్నీ 

పాడుచేసుకుంటాడు ఇంకొకడు!

ఊపిరి తిత్తుల్ని మాడ్చి

పిండి పిప్పిచేసే పొగ దుశ్చరిత్ర

అంతా ఇంతా కాదురోయి…

దంత క్షయం…క్షయ

కేన్సర్…రాక్షస పుండు…

దీర్ఘకాల దగ్గు…అనారోగ్య పెగ్గు!

వద్దు నాయినా వద్దు

పొగత్రాగు వ్యసనం వద్దు!

వ్యక్తికీ కీడు పరిసరాలకూ…

తీవ్ర హానికరం...నీ స్వరం

నీ ఆరోగ్య సర్వస్వం…

పొగార్పితం మృత్యుకారణం!

పొగత్రాగువాడు సామూహిక

హంతక సమానుడేరోయ్!!!

…………………………..


    ఎం వి స్వామి



Rate this content
Log in