ఇదే నేటి భారతం
ఇదే నేటి భారతం
ఇదే….నేటి భారతం!
………………………...
పిడికెడు కూడు
బోలెడు ఆకలి
కొంచెం డబ్బులు
ఎక్కువ ఖర్చులు!
నిచ్చెన లేస్తూ…
నింగికి ఎక్కుతూ…
ఎక్కిన మెట్టే…
ఎక్కుతూ దిగుతూ…
తక్కువే...ఎక్కువ!
ఎక్కడ గొంగళి అక్కడే
చుట్టం చూపుకి…
రూపాయొచ్చి…
వచ్చిన వెంటనే…
వెళ్తానంటూ…వడ్డీ
ఆశామి ఇంటికి పోయే!
రైతే రాజు అంటే…
పొంగిపోవాలా…!
పొయ్యలో పిల్లిని
తరిమి వేయాలా…!
రూపాయి బియ్యం
నూకలు గెంజి
వందల ధరలో
సీసా బ్రాందీ…!
ఏది నిజం…
ఇంకేది అబద్దం..
కుడి చేత్తో ఇచ్చి..
ఎడమ చేత్తో లాక్కొనే…
పథకాలు అమలుకే
అ...సంక్షేమ రాజ్యాలు
నకిలీ భోజులు…!
కోవిడ్ కల్లోలాన్నీ…
అనుకూలంగా మార్చుకొనే…
పాలకుల పాలపుంతలు
పెట్రోలు ధర బగ్…
పప్పులు ధరలు బగ్ బగ్
కూరధర…నారధర
చివరకు నీరుధర
ఆకాశాన్ని అంటి…
నల్ల బజార్ నగిసీలై…
అసలు బంగారం లెక్కన..
అమ్ముడు పోతుంటే….
జియస్టీలో వాటాల
లెక్కల బిజీలో….
కేంద్రం…రాష్ట్రాలు!
నకిలీ సరుకులు…
నాణ్యతలేని సేవలు
అడిగే నాధుడే లేడని
ప్రయాణికులనూ…దోచుకునే
ప్రయాణ వనరులు!
గోల గోవిందరాజులుది
ముడుపులు వెంకన్నవి
నెపం కరోనాపై
జపం లాభాలు గుంజుటపై!
అక్కడా ఇక్కడా కాదు
ఎక్కడా సరైన వైద్యం లేదు
విద్యలేదు ఉపాదీ లేదు
మోసం మోసం…
మోసాలకు కాపలాగా…
ప్రభుత్వాల తత్వం..!
ఉన్నవాడికి స్వర్గ సుఖాలు…
లేనివాడు అష్ట కష్టాలు!
లేకున్నా ఉన్నట్లుండే…
మధ్యతరగతి మనుషులకు
త్రిశంకు స్వర్గాలు!
ఇదే నేటి భారతం…
అదే ప్రతీపేటలోని జీవనం!
………………………..
ఎం వి స్వామి
9441571505