మహిళ
మహిళ
మహిళ
…………………..
ఆప్యాయతల వేదిక
అనురాగాల భూమిక
ఆత్మీయతల మేలి కలయిక
రక్షణ వలయం
సురక్షిత నిలయం
అభయహస్త సమూహం
ప్రియం ప్రేమమయం!
విశ్రాంతి కోరని
మమతల మంత్రం
సహృదయతాయంత్రం!
మర్మమెరుగని మాతృమూర్తి
కరుణామూర్తి
కారుణ్యదాత్రి
అమృతం…సర్వ శ్రేష్టం!
అవిశ్రాంత కృషీవళి
పిల్లల అభ్యున్నతికి…
కరిగి వెలుగులిచ్చిన దీపిక!
త్యాగమయ జీవన కరదీపిక!
కష్టాల కడలి కానీ…
చిరునవ్వుల కెరటం
ఉన్ననాడు...లేనినాడు
ధైర్యం గుండె నిబ్బరం
మనసున్న మహావృక్షం
మాయ చెయ్యని
మంత్రదండం మన ప్రపంచం!
జన్మనిచ్చి జీవితాంతం
ఒడిలో పెట్టుకొని కష్టనష్టాల్లో....
ఓదార్చి ఒడ్డుకు చేర్చి...
ఓర్పు నేర్పులతో సంతానాన్ని
సమోన్నతులుగాతీర్చిదిద్ద
సమిద అయ్యిన
మహిళా కీర్తి సర్వోన్నత స్ఫూర్తి!
అమ్మ...అక్క....చెల్లి
చెలియ...కూతురు...స్నేహితురాలు
పాత్ర ఏదైనా ప్రేమ ఒక్కటే…
బాధ్యత ఏదైనా…
అంకిత భావమొక్కటే…
హితం...కుటుంబ హితం
అందుకే మహిళ మగవానికన్నా
ఉన్నతం మానవ జాతి శ్రేష్టం!
…………………………….
ఎం వి స్వామి