STORYMIRROR

M.V. SWAMY

Inspirational

4  

M.V. SWAMY

Inspirational

బొమ్మకాదు... అక్షరాలా'అమ్మే'!

బొమ్మకాదు... అక్షరాలా'అమ్మే'!

1 min
346

బొమ్మకాదు... అక్షరాలా'అమ్మే'!


అమ్మ...తానే బ్రహ్మై...


జన్మనిస్తుంది...!


నీ జీవి తానై....తన


జీవితాన్నే దారపోస్తుంది!


ఆకలంటే...


అన్నమై ఆదుకుంటుంది!


కోపమైతే...


వెన్నెలై ఊరడిస్తుంది!


అలకబూనితే....


భౌద్ధమై బోధబరుస్తుంది!


అల్లరి చేస్తే....


ఆట వస్తువై ఆటలాడిస్తుంది!


కష్టమొస్తే....


ఇలలో దైవమై ధైర్యమిస్తుంది!


సుఖముగుంటే...


సంతోష సాగరమై ఉరకలేస్తుంది!


నేల పడితే....


భూమితానై హత్తుకుంటుంది!


నింగి కేగిరితే....


నీలి గొడై హద్దు చెబుతుంది!


చెడ్డవద్దని...


నెత్తీనోరై.... మొత్తుకుంటింది!


నడిచినప్పుడు...


నేలతానై నడపజూస్తుంది!


పరుగులిడితే....తానే


అడుగై నిన్ను మొస్తుంది!


ద్రాహమంటే.....


అమ్మతనమే అమృతమౌతుంది!


గుక్కపెడితే...


దిక్కులదిరేలా ఆత్రుతపడుతుంది!


నవ్వుతుంటే...


తాను మువ్వై గళ్ళుమంటుంది!


కన్నీరు పెడితే....


కలతవర్షపుజల్లులౌతుంది!


జీవితాంతం మట్టిముద్దై...


నీవుకోరిన రూపులో....


కంచుకోటగా నిన్ను మలిచి....


ఖంగుమన్న....


నీ జీవితవీణ వినడానికే...


పరితపిస్తుంది!


నీవు అందమైతే...


ఆనందచందమౌతుంది!


నువ్వు బ్రతికిన బ్రతుకుఅంతా!


అమ్మకొమ్మకు ...


పూసిన పుష్పమే....!


నిన్ను నిన్నుగా నడిపి పెంచిన


అమ్మరా దైవం!... బ్రహ్మకాదు!


గోడనున్న ఆ బొమ్మకాదు!


......ఎం.వి.స్వామి

 

    9441571505


Rate this content
Log in

Similar telugu poem from Inspirational